Friday, February 24, 2012

మార్పు నీలో కాదు రావలసింది....నీ ఆలోచనలలో

ఆరోజు ఆదివారం...పిల్లలు ఉదయం నుండి "అమ్మ జెమిని సర్కస్ వచ్చింది...తీసుకుపోమా. ప్లీస్" అని ఒకటే గొడవ. పరీక్షలు వస్తున్నాయి ఇపుడు వద్దు అని నేను. ఇక మా జేమ్స్ బాండ్ (నా కూతురుకి వాళ్ళ నాన పెట్టిన ముద్దు పేరు) వాళ్ళ నాన్నతో స్పెషల్ రికమండేషన్. అమ్మడు తీసుకు పోరాదు...జేమిని సర్కస్ ఎప్పుడు రాదు కదా... రెండు గంటలే. కాదనక వెళ్లి రా అని ఫోనులో గట్టిగా చెప్పారు. ఇక నో అనకుండా వాళ్ళతో కలిసి సర్కస్ కి వెళ్లాను. సెలవు రోజు కావటంతో  పిల్లలు, పెద్దలతో బాగా రద్దీగా ఉంది.
అటుగా నేను కార్ పార్క్ చేస్తుంటే  డేరాలతో వేసిన సర్కస్ కాంపౌండ్ వెనక నిల్చున్న గజ ఏనుగు కనిపించింది.
"చిన్నూ అటు చూడు...ఎంత పెద్ద ఎనుగో...అంటూ కార్ నుండి దింపి చూపించాను. పిల్లల మొహం ఆనందంతో వెలిగిపోతోంది. ఇంట్లో నుండి రావడానికి ముందే పిల్లలు సర్కస్ షోస్ ని ముందు వరసలో కూర్చోపెట్టి చూపించాలి అనే డిమాండ్ కి అప్రూవల్ తీసుకోవటంతో ఫ్రంట్ రో టికట్స్ తీసుకొని ముగ్గురం కూర్చున్నాము. షో ఇంకా మొదలు కాలేదు.  అన్ని వరుసలు జనాలతో నిండి పోయాయి. షో ప్రారంభం అయ్యింది. మొదట మనుషుల జమునస్టిక్స్, చిలుకల ముచ్చట్లు, జోకర్ల కామెడి, సింహాల తో ఆట..ఇలా చాలా కార్యక్రమాలు ఎంతో వుల్లాసవంతంగా సాగిపోతున్నాయి. ముఖ్య కార్యక్రమం గా ఒక పెద్ద గజ ఏనుగు చిన్న స్టూల్ మీద నిల్చొని వొంటి కాలితో చేసిన విన్యాసం ఎంతో మందిని అబ్బుర పరుస్తూ ఆకట్టుకుంది. చివరగా కోతుల ఆటలతో షో ముగిసింది.  మెల్లగా పిల్లలని తీసుకొని బయటికి వస్తున్న నాకు ఒక మూలకి అంతటి పెద్ద గజ రాజుని చిన్న గుంజకి గొలుసులతో కట్టి వేయడం కనిపించింది. మనసులో ఇంత బలమైన ఏనుగు అంత చిన్న గుంజకి బందీగా ఎందుకు వుంది? అని నేను అనుకుంటుంటే నా మనసుని చదివినట్లు నా పదిహేను సంవత్సరాల కొడుకు "అమ్మా ఇంత పెద్ద బలమైన ఏనుగు ఎలా అంత చిన్న కర్ర గుంజకి విడిపించుకోకుండా వుంది?" అని అడగటంతో అక్కడ ఉన్న మావటిని అడిగి విషయం చేదిన్చాల్సిందే అని నిర్ణయించుకొని ముగ్గురం ఏనుగు దగ్గరకి వెళ్ళాము..
"బాబు ఇంత పెద్ద ఏనుగుని ఎందుకు అంత చిన్న గుంజకి కట్టేశారు?" అని అడిగిన నన్నూ అతను అదోలా నవ్వుతూ చూడటం గమనించాను.
"ఏముందంమ్మా...మేము చిన్న పిల్లగా ఉన్న ఏనుగుని తీసుకొచ్చి పెద్ద గుంజకి కడతాం. అది విడిపించుకోవాలని చాలా ప్రయత్నం చేస్తుంది.  కాని అప్పటి దాని బలం అందుకు సరిపోదు. మళ్ళి మళ్ళి ప్రయత్నించి ఇక తన వల్ల కాదనే నిర్ణయానికి వచ్చి వదిలేస్తుంది. అలా తన బలం పెరిగిన తను మాత్రం ఆ గొలుసుని విప్పోకోడానికి ప్రయత్నం చేయదు. " అని నవ్వుతూ చెప్పి వేరే జంతువులదగ్గరకి వెళ్ళిపోయాడు. కిట్టూ కి ఎంతవరకు అర్ధంయ్యిందో నాకు తెలియ లేదు కాని నాకు మాత్రం అందులో ఏదో ఒక సత్యం నేర్చుకోవాల్సింది వుంది అని మాత్రం అర్ధం అయ్యింది.

పిల్లలతో మళ్ళి నా కార్ రోడ్ ఎక్కింది. ఆలోచనలు మాత్రం దేనికోసం వెతుకుతున్నాయి. కూకట్ పల్లి రోడ్లో బాగా ట్రాఫిక్ ఉండటంతో నా కార్ ఆగింది. అలా అద్దంలోనుండి  చూసిన నాకు పక్కనే బస్టాప్ లో నిల్చున్న "కమల" వొదిన కనిపించింది. అప్రయత్నంగానే "కమలోదినా" అంటూ గట్టిగా నా అరుపు తనని తాకింది.

"సుధా" ఎంత కాలమైంది నిన్ను చూసి? అంటూ దగ్గరకు వచ్చింది.
'సరే కాని ఎక్కడికి వెళ్తున్నావు? రా కారెక్కు నిన్ను డ్రాప్ చేస్తాను". అంటూ డోర్ తీసాను. కమలోదిన నా పక్కన కూర్చుంటూ "పిల్లలు చాలా పెద్దోల్లయ్యారే" అంటూ వారిని పలకరించింది. నేను తననే పరిశీలనగా చూస్తున్నానని గమనించి "నన్నూ బాగానే గుర్తు పట్టావు సుధా" అనడంతో నేను చూపు మార్చి "ఏంటి వదినా ఇలా తయారయ్యారు? ముందు మీరేనా కాదా? అని ఆలోచించా కాని అప్రయత్నంగానే మిమ్మల్ని పిలిచాను. అంతా బాగానే ఉన్నారు కదా..ఇప్పుడేక్కడుంటూన్నారు? అన్నయ్య..పిల్లలు ఎలా ఉన్నారు" అని ప్రశ్నల వర్షం కురిపించాను.
నా ప్రశ్నలతో తన కళ్ళు వర్షించటం చూసి నా కార్ని సైడ్ కి తీసుకొని పక్కనే ఉన్న బేకరీలో పిల్లలని కూర్చోపెట్టి తనతో మాట కలిపాను.
"సుధా నీవు నన్నూ కలిసి దాదాపు పదేళ్ళు దాటిందా? అయి ఉండచ్చు కూడా...తను పోయి అపుడే మూడేళ్ళు కదా.." అంటూ కన్నీలు తూడ్చుకుంది.  

"వాట్? " అంటూ ఆశ్చర్య పోవటం నా వంతయ్యింది. 
"అవును రా...మీ అన్నయ్య షాపు నుండి వస్తూ ఆక్సిడెంట్లో చనిపోయారు.  ఏ రోజు చిన్న కష్టం కూడా నాకు చూపించని చెట్టంత మనిషి చనిపోవటంతో షాపు బాధ్యత ఇంటి బాధ్యత నా మీద పడింది. షాపు లో కూర్చుంటున్న నాకు తెలిసింది అది అప్పుల్లో కూరుకొని ఉంది అని. ఇక లాభం లేదని షాప్ని అమ్మేసాను. ఇల్లు మార్చేసాను. పదేళ్ళ క్రితం నువ్వు ఎంత చెప్పినా ఆయన, అత్తయ్య వద్దన్నారని ఆడ పిల్లలకి ఈ ఉద్యోగం ఏమిటి...చేయ లేదు అని వాల్లంటుంటే నేను ఆ లేడి కండక్టర్ జాబులో జాయిన్ అవకుండా ఇంట్లోనే వున్నాను. ఇప్పుడు చూడు కేవలం 3000 రూపాయల జీతానికి రోజంతా చాకిరి చేస్తున్నాను. నువ్వు చెప్పినట్లు నేను అప్పుడు చేరి ఉండి ఉంటె నా జీవితం వేరేలా ఉండేది సుధా. కాని ఏమి చేస్తాను అప్పుడు నా బలహీనత మీద ఉన్న నమ్మకం చేయగలననే విశ్వాసం మీద లేదు.  అతను లేరనే వేదన వొక వైపు...పిల్లల బాధ్యతలతో ఆర్ధికంగా నిలబడలేక ఈ పోరాటం ఇంకో వైపు...":అంటూ కన్నీళ్ళ పర్యన్తంయ్యింది కమలోదిన. 
ఏమి చెప్పి  ఎలా చెప్పి వోదార్చాలో తెలియలేదు. మౌనంగా పిల్లలని తీసుకొని కమలోదినతో వాళ్ళింటికి వెళ్లి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ వాళ్ళ పిల్లలతో కాసేపు గడిపి "నాకు తెలిసిన వారితో మాట్లాడి మంచి ఉద్యోగం వచ్చేలా చూస్తాను వదిన" అనే మాట చెప్పి ఆమెకు కొంత ఊరట కల్పించి తరిగి ఇంటికి ప్రయాణం అయ్యాను. 
నా ఆలోచనలు తిరిగి ఆ ఏనుగు దానిని గుంజకి కట్టేసిఉన్నకాలి గొలుసు గుర్తుకు వచ్చాయి. అవును నేను ఆలోచించిన సత్యం నాకు కమలోదిన జీవితంలో కనిపించింది. తను ఒకరి మాటలతో తను బలహీనురాలిగా చిన్న ప్రయత్నం తోనే ఆగిపోయింది. తిరిగి ప్రయత్నించి వుంటే తన జీవితం ఈ గజరాజులా సమస్యల సంకెళ్ళలో ఉండేది కాదేమో...

అవును, కొన్నిసార్లు మనిషి తను గతం లో ఉన్న స్థితికి బందీగా ఉండిపోతాడు, మనము అది సాధించలేము  ఇది సాదించలేము. మనవలన అవుతుందా? ఈ పని చాల కష్టం ఎందుకంటే నేను ఒక్కసారి చేశాను బట్ ఐ FAILED, మరల చేసిన వృధానే, ఉన్నదానిలోనే బ్రతుకుదాం ఎందుకు ఈ వృదాప్రయాస అనే మన ఆలోచన విదానం లో నుంచి మనం బయటకి  వచ్చి మనలో మార్పుకోసం క్రోత్త ప్రయత్నం ఒకటి చేద్దాం లేకపోతే మరోసారి ప్రయత్నిద్దాం మన తోటివాడు సాదించగా లేనిది మనం ఎందుకు సదిన్చలెం?.... మనము చేయగలం అనే సంకల్పం తో జీవితం ఒక సవాలుగా తీసుకుంటే  కమల జీవితం లో ఈ రోజు ఇంత కన్నీరు ఉండేది కాదు..... అంతటి బలశాలి అయిన ఆ గజరాజు అల బందీగా ఉండేది కాదు.... ఒక గెలుపు పొందాలి అంటే మారవలసింది మన ఆలోచన విదానం పరిస్థితులు కాదు......
నీవు గెలుపుకోసం చేసే ప్రయత్నం లో ఓడిపోవచ్చు... కానీ నివు చేసే ప్రయత్నం లో ఓడిపోవద్దు..... నీ ప్రయత్నం గెలుపు పోదేవరకు..
 ఇట్లు మీ సుధారాణి చల్ల.

2 comments:

  1. Inspiring one Sudha garu....అంతా ఆలోచించాల్సిన విషయాలను సులభశైలిలో చెప్తున్న తీరు బాగుందండీ...థాంక్యూ..

    ReplyDelete
  2. Thank u Varma gaaru..Nice of your encouragement

    ReplyDelete