Friday, June 17, 2011

ప్రకృతి మాత



అటుగా వెళుతున్న నేను.... అనుకోకుండా చూసేను నా కను చూపులు..ఏమిటా అనీ...
అరుదైన ఆ గడ్డిపూల...చిరు రెక్కలపై తుమ్మెద గ్రోలు మధుర మకరందాలు...
అదేమిటా నా రత్న మాలలో ఉండ వలసిన రత్నం ఈ గడ్డి పోచ తలవొంచి మరీ అలంకరించింది                               అని చూడగా కనిపించిన అద్భుతం...
ఆ మంచు బిందువు..ఆ రాత్నాకరుడి కిరీటంనుండి రాలి పడి ఆ పేద గడ్డి పోచని వరించి...విరింప చేసినదా అని..
ఆ ప్రకృతి మాత ఎన్ని అందాలను తనలో వుంచుకొని....నిత్య యవ్వనాన్ని మనకి పంచుతోంది?

నా ప్రేమ బంధమా..


విర బూసిన కమలం వెల వెల బోయెను... నీ చిరు నవ్వు గల గలలకు 
విప్పారిన వెన్నల నీరుగారెను నీ చెక్కిలి ప్రకాశమునకు 
నాట్య మయూరి అడుగులు తడబడెను నీ పదముల మువ్వల గల గలలకు 
కోకిల గానం శ్రుతి తప్పెను నీ స్వరాహ ప్రవాహం కు
నీ అర విరిసిన అందం ముందు ప్రకృతి తల వంచి తెరచాటు కేగే
నీ మేను స్పర్శకు ఆ హిమ బిందువే తహ తహ లాడే 
అంతటి నీవు నా ఎదుట దేవతలా నిలువగా నా హృదయం పరవశించేనా..ఓ నా ప్రేమ బంధమా...

Wednesday, June 15, 2011

"Ame"


"TIME"



"మార్పు "


"జీవితం"

జీవితం ఒక యుద్ధం - పోరాడటం నేర్చుకో 
జీవితం ఒక ఆట - గెలిచేందుకు ప్రయత్నించు
జీవితం ఒక చిక్కు పడిన దారం - ముడులు విప్పడం అలవరచుకో
జీవితం ఒక పెను తుఫాను - బయటపడే నావనేతుక్కో
జీవితం ఒక సుడిగుండం - ఎదురీతకు వెనకాడకు
జీవితం ఒక కల్లోల సాగరం - దరి చేరే మార్గం వెతుక్కో
జీవితం ఒక సవాలు - జవాబుని అన్వేషించు
జీవితం ఒక సమస్యల వలయం - పరిష్కార దిశగా సాగించు నీ పయనం 
"నీ" జీవితం చేజారిన పచ్చల కలశం - కన్నీటి ముత్యాలను ఎరుకో 
జీవితం మధురసకోశం - జ్ఞాపకాల పుటలు తిరిగేసి స్మృతులు దాచుకో