మనసులోని భావాలు మాటలలో.... పరవశించే మాటలు కవితలలో..... నిశ్శబ్దపు సవ్వడులు అక్షరాలలో....... వేరసిన కుసుమపరాగాలు సుధలుగా
Wednesday, January 18, 2012
Monday, October 10, 2011
Saturday, September 17, 2011
Wednesday, July 20, 2011
Monday, June 27, 2011
Friday, June 17, 2011
ప్రకృతి మాత
అటుగా వెళుతున్న నేను.... అనుకోకుండా చూసేను నా కను చూపులు..ఏమిటా అనీ...
అరుదైన ఆ గడ్డిపూల...చిరు రెక్కలపై తుమ్మెద గ్రోలు మధుర మకరందాలు...
అదేమిటా నా రత్న మాలలో ఉండ వలసిన రత్నం ఈ గడ్డి పోచ తలవొంచి మరీ అలంకరించింది అని చూడగా కనిపించిన అద్భుతం...
ఆ మంచు బిందువు..ఆ రాత్నాకరుడి కిరీటంనుండి రాలి పడి ఆ పేద గడ్డి పోచని వరించి...విరింప చేసినదా అని..
ఆ ప్రకృతి మాత ఎన్ని అందాలను తనలో వుంచుకొని....నిత్య యవ్వనాన్ని మనకి పంచుతోంది?
నా ప్రేమ బంధమా..
విర బూసిన కమలం వెల వెల బోయెను... నీ చిరు నవ్వు గల గలలకు
విప్పారిన వెన్నల నీరుగారెను నీ చెక్కిలి ప్రకాశమునకు
నాట్య మయూరి అడుగులు తడబడెను నీ పదముల మువ్వల గల గలలకు
కోకిల గానం శ్రుతి తప్పెను నీ స్వరాహ ప్రవాహం కు
నీ అర విరిసిన అందం ముందు ప్రకృతి తల వంచి తెరచాటు కేగే
నీ మేను స్పర్శకు ఆ హిమ బిందువే తహ తహ లాడే
అంతటి నీవు నా ఎదుట దేవతలా నిలువగా నా హృదయం పరవశించేనా..ఓ నా ప్రేమ బంధమా...
Subscribe to:
Posts (Atom)


