Thursday, May 23, 2013

వసంత రాగం


వసంత రాగం
శ్రావణ పంచమి

శిశిర సుఖం
మాఘ పౌర్ణమి

నీ చేతి ముని వ్రేళ్ళ స్పర్శ
నా మేడలో మాంగల్యమై

కాలంతో కలిసి
నీ చేతిలోనా చేయి

నా నుదిటిన నీవు
దిద్దిన సింధూర వర్ణం

అర చేత విరిసిన
ఎర్రని గోరింట

మది మెరిసిన
నును బుగ్గల సిగ్గంత

నను నిను కలిపిన
ఆ శ్రావణ రేయి

శ్రీనాధుడి మరో
శృంగార కావ్యమేనోయి - challa (BSS)


1 comment:

  1. కవిత బాగుంది. కాగా మొదటి 4 లైన్స్ భావం అర్థం కాలేదు.గోరింట ఫోటో కవితకు దర్పణం పడుతూ చాలా బాగుంది.


    ReplyDelete