Thursday, May 23, 2013

వసంత రాగం


వసంత రాగం
శ్రావణ పంచమి

శిశిర సుఖం
మాఘ పౌర్ణమి

నీ చేతి ముని వ్రేళ్ళ స్పర్శ
నా మేడలో మాంగల్యమై

కాలంతో కలిసి
నీ చేతిలోనా చేయి

నా నుదిటిన నీవు
దిద్దిన సింధూర వర్ణం

అర చేత విరిసిన
ఎర్రని గోరింట

మది మెరిసిన
నును బుగ్గల సిగ్గంత

నను నిను కలిపిన
ఆ శ్రావణ రేయి

శ్రీనాధుడి మరో
శృంగార కావ్యమేనోయి - challa (BSS)


Tuesday, February 12, 2013

"ఆకాశమంత ప్రేమ"





ఆకాశం  అంతా నీలంగా వుంది...  
భూమి  అంత  వేడి  నిట్టూర్పులతో  వేడెక్కి  వుంది ... 
పక్షులు తల  దాచుకోవడానికి  చిగురుటాకుల  నీడ  లేక 
మోడు  బారిన  కొమ్మలలో గూళ్ళు  కట్టు  కున్నాయి .. 
జీవులన్నీ  వేడి   తాపం  తీర్చుకోడానికి  
కన్నీటినే పన్నిటిగా మల్చుకోలేక అవస్థ పడుతున్నాయి... 

అంతా కరువు ...
నిలువ నీడ లేక 
తాగ నీటి చుక్క లేక 
మింగ మెతుకు లేక 
సకల జీవ రాశి అవస్థ పడుతోంది... 
అలాంటి సమయంలో 
చల్లని చిరుగాలి నల్లటి మేగాన్ని వచ్చి అడిగింది... 

"మేఘమా మేఘమా... ఎందుకు నీవు వర్షించటం లేదు? 
చూడు! నీ రాకకై సకల జీవరాశి ఎలా ఎదురు చూస్తోందో... 
నేవు లేక వాటి దుస్థితి చూడు ఎంత వేదనగా వుందో...
ఒకసారి వర్షించి వాటికి జీవాన్ని ఇవ్వవూ?..." 
 
మేఘం: "ఓ చిరుగాలి! 
నీ స్పర్శ నాకు దూరమైనంత వరకు
నేను ఎంత పెద్ద మేఘాన్నయినా  
ఒక మంచు తెరగా వుండే వ్యర్ధాన్నే... 
నువ్వు నాకు దూరమైవుంటే 
నేను జీవమున్న నిర్జివాన్నే..     
నీవు నన్ను స్పర్శించినపుడే..
నేను పులకరించి వర్షిస్తాను....
అపుడే కదా ఈ జీవరాశి నన్ను హర్షించేది..

నన్ను వీడి నివు ఉండలేవు... 
నిన్ను వీడి నేను ఉండ లేను... 
మనం ఇరువురం లేనిదే ఈ సృష్టి ఉండదు.. 
ఒకరికి ఒకరం ఆత్మల్ల పెన వేసుకున్నాం...
అంటున్న మేఘాన్ని పెన వేసుకున్న చిరుగాలి కౌగిలి లో 
పరవశించి పోయిన మేఘం ప్రేమ అనే నీటి బిందువులతో 
సకల జీవరాశికి జీవాన్ని నింపింది...
ఓ నా 'సుంధర' మేఘమా... నే చిరుగాలినై  నీ ప్రేమ స్పర్శతో 
శిశిర ఝరి నై  'సుధ'లు కురిపించనా.....
మధురమైన సృష్టిని స్వాగతిన్చనా....


Monday, February 11, 2013

జీవం నాది గా  
ఆ భావం నీది గా 

మది నాదిగా 
మెదిలే రూపం నీదిగా 

వేసే అడుగు నాదిగా 
చేరే గమ్యం నీదిగా 

పల్లవి నాదిగా 
పలికే రాగం నీదిగా

క్షణ క్షణం నాదిగా 
ఈ జీవితం మే నీదిగా 

ఓ నా ప్రియ బంధమా 
ఈ భాన్ధవ్యమే మనదిగా 

CHALLA SUDHA 

Friday, February 24, 2012

నా రూపాయి....Its My one rupee


చిన్ను,  చెల్లి లంచ్ బాక్స్ వదిలేస్తోంది...జాగ్రతగా మెల్లగా బుజ్జగించి...మధ్యహ్నం తినిపించు....అటు ఇటూ చూసి ఎక్కండి బస్ " అని పిల్లలకు బయ్ చెప్పి వంటగదిలోకి పరిగెత్తుకోచ్చాను....అప్పుడే తొమ్మిదయ్యింది. వడి వడి గా నా లంచ్ బాక్స్ సర్దుకొని, హ్యాండ్ బాగ్ తీసుకొని బయటికి వస్తుంటే అమ్మా " ఏమైనా తిని వెల్లవే..." అనటం వినిపించింది. సమాధానం చెప్పడానికి కూడా అందనంత వేగంగా బయటికి వచ్చాను. బైక్ స్టార్ట్ చేసి రోడ్  మీదకు వచ్చిన ఐదు నిమిషాలకు ఇంజన్ ఆగిపోయింది. పెట్రోల్ లేక అది మొరాయిన్చిందని అర్ధమయ్యింది. చః....నాకు అస్సలు బుద్ధి లేదు. పెట్రోల్ వుందో లేదో కూడా ముందు చూపు లేదు. ఏమిటో ఉదయం ఆఫీసు తొందర...సాయంత్రం ఇల్లు తొందర. ఆలోచిస్తుంటే బాస్ కళ్ళముందు కనిపించింది...బైక్ పక్కకు పెట్టి 
"ఆటో..ఆటో" అంటూ కేకేసాను
 "బోలో మాడం...కా జానాహై..."  గుట్కా నిండిన నోటితో అడిగాడు...
"బేగంపెట్ వెళ్ళాలి" అని తెలుగులో చెప్పాను...
"నూటరివయ్ రూపాయలౌతయ్" అంటూ చెప్పేటప్పుడు వాడు తెలుగోడని అర్ధమయ్యింది...
"మీటరున్దికదా...అది ఎంతైత అన్తిస్తాను...ఒక్క రూపాయి కూడా ఎక్కువివ్వను..." అన్న నన్ను వాడు ఎగా దిగా చూడటం నాకు BP ని తెచ్చింది. 
"మీటర్ మీద కుదరదమ్మ...వస్తే రా లేకపోతే లేదు..." పోద్హున్నే బలే గిరాకి దొరికింది అని   మనసులో అనుకుంటూ ఆటో స్టార్ట్ చేసి నా సమాధానం కోసం నిలబడ్డాడు. 
"అసలు మీకు గవర్నమెంట్ ఎందుకు మీటర్ ఇచ్చింది...ఆకారానికా...ఎందుకు మీటర్ మీద రావు? అయ్యేది డెబ్బై రూపాయలు మీరు అడిగేది దానికి రెండితలు. ఎవరు అడిగే వారు లేరనా మీ ఇష్టం వచ్చినట్లు చెప్పుతున్నారు? " అని నా BP  అంత వాడి మీద వెల్లగక్కాను. 
"పో..పో మ్మ...వస్తే రా లేక పోతే లేదు...పొద్దున్నే నేనే దొరికానా నీకు..బలే అమెగున్నావ్ తీ..." అని అనుకుంటూ ముందుకి వెళ్ళిపోయాడు  

అయ్యో రామ...! మళ్ళి నా స్థితి ఏమిటిప్పుడు? ఆటోలో మీటర్ని కాదని వెళ్ళడానికి మనసోప్పుకోదు...బస్సులో ఇంకా లేట్... అనుకుంటూ అటు ఇటూ చూసే సరికి పెట్రోల్ బంక్ దేవుడిలా కనిపించింది. వేగంగా బండి తోసుకుంటూ బంక్ లోకి వెళ్లాను. 

ఆ పెట్రోల్ బంకులో మీటర్ ఫీడ్ చేయకుండా పెట్రోల్ పోసి...60 పైసలు తగ్గించాడు...
ఏమిటిలా చేసావు అని అడిగితే మీటర్ రీడింగ్ ఇలానే వుంటుంది అన్నాడు....
నాకు చాచి ఒక్కటి చెంప మీద కొట్టాలనిపించింది...
"ఏ మీ మీటర్లు జనాలకోసం పని చేయవు... జలగల్లా జనాల రక్తం రూపాయ్ రూపాయ్ గా తాగంది మీకు ముద్దేక్కదు...." అని మనసులోనే తిట్టుకుంటూ 
సిగ్నల్ దగ్గరకు వచ్చాను...రెడ్ సిగ్నల్ తో ఆగిపోయాను...టైం చూస్తే పది అవుతోంది. కళ్ళముందు డిల్లి నుండి వస్తున్నా బాస్ కనిపించింది. ఇక టెన్షన్ మొదలయ్యింది. త్వరగా చేరుకోవాలి ఆఫీసుకి. చః...ఎంత తొందరగా లేచినా ఇంట్లో పిల్లలతో పని తెమలదు...ఈ రోజు ఆమెతో నాకు చివాట్లు తప్పవు.. అని నన్ను నేను తిట్టుకుంటూ వుంటే చంకలో చంటి బిడ్డను వేసుకొని రూపాయి కోసం చేయి చాచింది ఒక గుడ్డి మహిళ.... మళ్ళీ నాకు పెట్రోల్ బంక్ రూపాయి  గుర్తుకు వచ్చింది... హాథ విధీ...అనుకుంటూ పర్సులో చిల్లర తీసి ఇచ్చి 'ఏమిటో ఈ గాదె కింద ఉండి తింటున్న పందికొక్కులు బయటపడవు. తిన్దామనేసరికి పేదోడికి గింజ దొరకదు...వీళ్ళు మారారు...సమాజం మారదు." అనుకుంటూ వుంటే గ్రీన్ సిగ్నల్ పడింది.

హమ్మయ్య అనుకున్నాను... అయినా పోలీసు బాబాయి ట్రాఫిక్ని వదలటం లేదు...అసలే బాస్ టెన్షన్..అందులోను లేట్..టైం చూసాను...పది ఐదు. 
బైకు ఆపి కాళ్ళు ఎత్తి చూసాను....అప్పుడు అర్ధమయ్యింది. శ్రీ....శ్రీ...శ్రీ...దేశోద్దరణ కై...క్షమించాలి...రాష్ట్రోద్దరనకై కంకణం కట్టుకొని బయలుదేరి వచ్చిన ముఖ్య మంత్రి గారి కాన్వాయి గురించి మా లాంటి అల్పుల వాహనాలకి బ్రేక్ పడ్డదని అర్ధమయ్యింది....

నన్ను అడగకండి ఆ తరువాత నా ఆక్రోశం   ఏమిటో.... 


నేను పెట్రోల్ బంక్లో అరవై పైసలు ఎక్కువ పెట్టినందుకు కాదు...ఆటో వాడికి వంద రూపాయలు ఎక్కువ పెట్ట లేకా కాదు.... అప్పనంగా, అన్యాయంగా జనాలని మోసం చేయటం ఒకటైతే...మనలో చాలా మంది నోరుమూసుకొని పోనీలే అరవై పైసలే కదా...వందే కదా అని అవసరాలను నెట్టుకుంటూ పోతూ రుచిమరిగిన వీళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తూ....ఖర్చు చేసే స్తోమత లేని వాడి చేత కూడా ఖర్చు పెట్టించే స్థితికి తీసుకువచ్చాము.... ఎన్ని అరవైపైసలు...కలిసి రోజులో వాడికి వేలుగా మిగులుతున్నాయి? ఎంతమంది ఆటోల మీటర్లు చప్పుడు చేయటం లేదో...మీకు అనుభవం అయ్యే వుంటుంది...ఆలోచించండి....వ్యతిరేకించండి   :)

Sudha Rani Challa

మానవత్వం మనుషులకే సొంతం

ఉదయం నుండి పని చేసిన అలసట వొంటిని వోదల్లేదు.  ఆఫీసు నుండి బయటికి మూడ్ ఆఫ్ గ వచ్చాను. వేడి గా కాఫీ తాగాలనిపించి మినర్వా దగ్గర ఆగి కాఫీ తాగి కొంచం రిలాక్స్ అయ్యాను. 
ఏంటో ఆలోచనలతో మెదడంత గజిబిజి గా ఉంది. సరే ఇంటికి వెళ్లి కొంచం సేపు రెస్ట్ తీసుకుందామని త్వరగా బయలు దేరాను. బండి బంజారహిల్ల్స్ మీదుగా మెహిదీపట్నం వైపుకి వేగంగా వెళ్తోంది. ఫోన్ లో FM పెట్టుకొని వింటూ బండి డ్రైవ్ చేస్తున్నాను. 
"మనసు మూగది మాటలు రానిది..." మరో చరిత్రలో పాట వస్తోంది. చిన్న చిరునవ్వు నా మోహంలో...అలా ఆలోచిస్తూ మెహిదీపట్నం జంక్షన్ కి వచ్చాను...
అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో నెమ్మదిగా వెళ్తున్నాను. నేను వెళ్ళే మలుపు దారిలో దూరంగా ఒక ముసలి వాడు క్రింద పడిపోయి వున్నాడు. 
"మన దగ్గర దొరికినంత దొంగ సారా వేరే ఎక్కడా దొరకదేమో..ఎక్కడపడితే అక్కడ తాగి ఇలా రోడ్డుకి అడ్డంగా పడిపోతారు. ఛః చ వీళ్ళు మారరు. సమాజం మారనీయదు." అనుకుంటూ ఆ ముసలి వ్యక్తి పక్కనుండి బండి పోనిచ్చాను. అలా వెళ్ళానో లేదో నా ఎదురు నుండి ఒక ముసలావిడ గుండెల మీద కొట్టుకుంటూ ఏడుస్తూ రావడం చూసాను. అప్రయత్నంగానే నా చేతులతో బండకి బ్రేక్స్ పడ్డాయి. బండి ఆపి ఆమె వెనకే వడి వడి గ వెళ్లాను. 
ఆ అవ్వ అతడి వద్దకు వెళ్లి తన బలమంతా కూడా కట్టుకొని లేపబోయింది. నేను వెనకగా వచ్చి నా చేతులతో అతడిని లేపడానికి ప్రయన్తినిచాను కాని నా  బలం అతడిని పూర్తిగా లేపడానికి సరిపోలేదు. అయ్యో అనుకుంటున్న సమయంలో ప్రక్కగా వెళ్తున్న తెల్లటి బెంజ్ కార్ మమ్మల్ని చూసి ఆగింది. ఆ కారులోనుండి నల్లటి సూట్ వేసుకున్న వ్యక్తి వేగంగా వచ్చి ఆ ముసాలడిని పట్టుకొని లేపాడు. అతని వెనక అతని డ్రైవర్ వచ్చి అతడిని పక్కకు తప్పించి మెల్లగా ఇతడిని నడిపించుకుంటూ ఆ పక్కన ఉన్న రాతి గట్టు మీద కూర్చో పెట్టారు. ఆ సూటు వేసుకున్న వ్యక్తి టైం చూసుకుంటూ "చలో చలో జల్ది జాన హాయ్. ఫ్లైట్ పకడ్నాహై" అంటూ డ్రైవర్ని పిలిచి కార్ ఎక్కి వేగంగా ఫ్లై ఓవర్ మీదకి వెళ్ళిపోయారు.  
నేను పక్కనే ఉన్న ఫుడ్ వరల్డ్ లోకి వెళ్లి ఒక వాటర్ బాటిల్ తెచ్చి మంచి నీళ్ళు తాగించమని అవ్వకిచ్చి "అసలేమైంది మామ్మా" అని అడిగాను. 
అవ్వ "పక్కనే ఉన్న రామా రావు నగర్ ఒల్దేజ్ హాం లో వుంటాంమమ్మ. కొడుకులు వదిలేస్తే మా పొట్ట మేము నింపుకోడానికి ఈ బస్తీకి వచ్చి ఇక్కడ వృద్దాశ్రమం లో ఉంటున్నాం మా... ఉదయం నుండి బాగా ఎండగా వుంది. అయినా చెప్పినా వినకుండా బస్టాప్ దగ్గర కొబ్బరి బొండాలు కొడతానని వచ్చాడమ్మ. సరే నేను వస్తాను పదా అని వెమ్మట వచ్చాను. ఇదిగో నన్నూ బండి దగ్గర నిలబెట్టి తను నీడపట్టున కూర్చుంటా అని వచ్చి ఇలా పడిపోయాడు. ఎంత చెప్పిన వినడు మా ఈ మనిషి. ఎప్పుడు పడి పోయాడో కూడా చూడని పాపిష్టి దాన్ని" అంటూ ఏడుస్తూ మెల్లగా అతనికి మంచి నీళ్ళు పట్టించింది. 

మెల్లగా అవ్వను ఆమె బండి దగ్గర వుంచి, తాతను పట్టుకొని పక్కనే ఉన్న ఆటోలో ఒల్దేజ్ హాం వద్ద దించి వచ్చి అవ్వకి చెప్పి నా బండి మీద తిరిగి ఇంటికి ప్రయాణమయ్యాను. నాతో పాటే నా ఆలోచనలు నన్ను వెంబడించాయి. 

అది రద్దీగా ఉన్న జంక్షన్. ఎంతో మంది బాటసార్లు, మోటార్ వాహనాలు, ట్రాఫిక్ పోలీసులు వుండే ప్రదేశం. కాని ఒక్కరు కూడా ఈ సంఘటనని చూడ లేదు. కనీసం అతడిని లేపడానికి సాయంగా కూడా రాలేదు. కారణం మన బడా మందు బాబులు. తాగి వొళ్ళు తెలియకుండా సోయి లేకుండా రోడ్ల మీద పడి బోర్లుతుంటే అటుగా చూస్తూ వెళ్ళే ప్రతి వాడికి వీళ్ళంటే అస్సహ్యమే. అందుకే తాగి కింద పడి పోయే వాడు... కష్టపడి శ్రమతో కళ్ళు తిరిగి కింద పడి పోయే వాడికి తేడా లేకుండా చేసారు చివరికి. చివరికి నేను కూడా అలా అనుకొనే మనసులో తిట్టుకుంటూ దాటి పోయాను. ఆ అవ్వ చెప్పిన మాటలకి నా మనసు బాగా కదిలిపోయింది. మనుషులని మనం చాలా తొందరగా అపార్ధం చేసుకుంటాం. తిరిగి అర్ధం చేసుకొనే లోపే మన చేతి సహాయాన్ని కోల్పోతాం. ఒకప్పుడు నేను షార్ట్ హ్యాండ్ నేర్చుకునే రోజులలో మా సర్ ఒక మాట చెప్పారు..."నీవు కళ్ళతో చూసింది సగమే నమ్ము చెవులతో విన్నది అసలే నమ్మకు". ఈ మాట ఆ క్షణం గుర్తుకు వచ్చింది. ఈ మాట అన్నిటికి వర్తించక పోయినా మానవ సంబందాలలో...మానవీయ కోణాలతో ఆలోచిస్తే మన అంతరాత్మే మన అనేక ఆలోచనలకి, అనుబంధాలకి పునరుద్దరణని, జవాబునిస్తుంది.  I Realized it... 

Helping Hand.....it may be yours to some one...hold it 
ఫ్రెండ్స్....జస్ట్ రోడ్ మీద సోయిలో లేకుండా ఎవరైనా పడి వుంటే ఒక నిమిషం ఆగి వారిని పరిశీలించి ముందుకు వెళ్ళండి. నాకెందుకులే అని మాత్రం వదిలి వేయకండి. ఎందుకంటే మీ చేతులతో పునర్జన్మ నిచ్చే అవకాశాన్ని మీరు జారవిడవనీయకండి. 

Sudha rani Challa

మార్పు నీలో కాదు రావలసింది....నీ ఆలోచనలలో

ఆరోజు ఆదివారం...పిల్లలు ఉదయం నుండి "అమ్మ జెమిని సర్కస్ వచ్చింది...తీసుకుపోమా. ప్లీస్" అని ఒకటే గొడవ. పరీక్షలు వస్తున్నాయి ఇపుడు వద్దు అని నేను. ఇక మా జేమ్స్ బాండ్ (నా కూతురుకి వాళ్ళ నాన పెట్టిన ముద్దు పేరు) వాళ్ళ నాన్నతో స్పెషల్ రికమండేషన్. అమ్మడు తీసుకు పోరాదు...జేమిని సర్కస్ ఎప్పుడు రాదు కదా... రెండు గంటలే. కాదనక వెళ్లి రా అని ఫోనులో గట్టిగా చెప్పారు. ఇక నో అనకుండా వాళ్ళతో కలిసి సర్కస్ కి వెళ్లాను. సెలవు రోజు కావటంతో  పిల్లలు, పెద్దలతో బాగా రద్దీగా ఉంది.
అటుగా నేను కార్ పార్క్ చేస్తుంటే  డేరాలతో వేసిన సర్కస్ కాంపౌండ్ వెనక నిల్చున్న గజ ఏనుగు కనిపించింది.
"చిన్నూ అటు చూడు...ఎంత పెద్ద ఎనుగో...అంటూ కార్ నుండి దింపి చూపించాను. పిల్లల మొహం ఆనందంతో వెలిగిపోతోంది. ఇంట్లో నుండి రావడానికి ముందే పిల్లలు సర్కస్ షోస్ ని ముందు వరసలో కూర్చోపెట్టి చూపించాలి అనే డిమాండ్ కి అప్రూవల్ తీసుకోవటంతో ఫ్రంట్ రో టికట్స్ తీసుకొని ముగ్గురం కూర్చున్నాము. షో ఇంకా మొదలు కాలేదు.  అన్ని వరుసలు జనాలతో నిండి పోయాయి. షో ప్రారంభం అయ్యింది. మొదట మనుషుల జమునస్టిక్స్, చిలుకల ముచ్చట్లు, జోకర్ల కామెడి, సింహాల తో ఆట..ఇలా చాలా కార్యక్రమాలు ఎంతో వుల్లాసవంతంగా సాగిపోతున్నాయి. ముఖ్య కార్యక్రమం గా ఒక పెద్ద గజ ఏనుగు చిన్న స్టూల్ మీద నిల్చొని వొంటి కాలితో చేసిన విన్యాసం ఎంతో మందిని అబ్బుర పరుస్తూ ఆకట్టుకుంది. చివరగా కోతుల ఆటలతో షో ముగిసింది.  మెల్లగా పిల్లలని తీసుకొని బయటికి వస్తున్న నాకు ఒక మూలకి అంతటి పెద్ద గజ రాజుని చిన్న గుంజకి గొలుసులతో కట్టి వేయడం కనిపించింది. మనసులో ఇంత బలమైన ఏనుగు అంత చిన్న గుంజకి బందీగా ఎందుకు వుంది? అని నేను అనుకుంటుంటే నా మనసుని చదివినట్లు నా పదిహేను సంవత్సరాల కొడుకు "అమ్మా ఇంత పెద్ద బలమైన ఏనుగు ఎలా అంత చిన్న కర్ర గుంజకి విడిపించుకోకుండా వుంది?" అని అడగటంతో అక్కడ ఉన్న మావటిని అడిగి విషయం చేదిన్చాల్సిందే అని నిర్ణయించుకొని ముగ్గురం ఏనుగు దగ్గరకి వెళ్ళాము..
"బాబు ఇంత పెద్ద ఏనుగుని ఎందుకు అంత చిన్న గుంజకి కట్టేశారు?" అని అడిగిన నన్నూ అతను అదోలా నవ్వుతూ చూడటం గమనించాను.
"ఏముందంమ్మా...మేము చిన్న పిల్లగా ఉన్న ఏనుగుని తీసుకొచ్చి పెద్ద గుంజకి కడతాం. అది విడిపించుకోవాలని చాలా ప్రయత్నం చేస్తుంది.  కాని అప్పటి దాని బలం అందుకు సరిపోదు. మళ్ళి మళ్ళి ప్రయత్నించి ఇక తన వల్ల కాదనే నిర్ణయానికి వచ్చి వదిలేస్తుంది. అలా తన బలం పెరిగిన తను మాత్రం ఆ గొలుసుని విప్పోకోడానికి ప్రయత్నం చేయదు. " అని నవ్వుతూ చెప్పి వేరే జంతువులదగ్గరకి వెళ్ళిపోయాడు. కిట్టూ కి ఎంతవరకు అర్ధంయ్యిందో నాకు తెలియ లేదు కాని నాకు మాత్రం అందులో ఏదో ఒక సత్యం నేర్చుకోవాల్సింది వుంది అని మాత్రం అర్ధం అయ్యింది.

పిల్లలతో మళ్ళి నా కార్ రోడ్ ఎక్కింది. ఆలోచనలు మాత్రం దేనికోసం వెతుకుతున్నాయి. కూకట్ పల్లి రోడ్లో బాగా ట్రాఫిక్ ఉండటంతో నా కార్ ఆగింది. అలా అద్దంలోనుండి  చూసిన నాకు పక్కనే బస్టాప్ లో నిల్చున్న "కమల" వొదిన కనిపించింది. అప్రయత్నంగానే "కమలోదినా" అంటూ గట్టిగా నా అరుపు తనని తాకింది.

"సుధా" ఎంత కాలమైంది నిన్ను చూసి? అంటూ దగ్గరకు వచ్చింది.
'సరే కాని ఎక్కడికి వెళ్తున్నావు? రా కారెక్కు నిన్ను డ్రాప్ చేస్తాను". అంటూ డోర్ తీసాను. కమలోదిన నా పక్కన కూర్చుంటూ "పిల్లలు చాలా పెద్దోల్లయ్యారే" అంటూ వారిని పలకరించింది. నేను తననే పరిశీలనగా చూస్తున్నానని గమనించి "నన్నూ బాగానే గుర్తు పట్టావు సుధా" అనడంతో నేను చూపు మార్చి "ఏంటి వదినా ఇలా తయారయ్యారు? ముందు మీరేనా కాదా? అని ఆలోచించా కాని అప్రయత్నంగానే మిమ్మల్ని పిలిచాను. అంతా బాగానే ఉన్నారు కదా..ఇప్పుడేక్కడుంటూన్నారు? అన్నయ్య..పిల్లలు ఎలా ఉన్నారు" అని ప్రశ్నల వర్షం కురిపించాను.
నా ప్రశ్నలతో తన కళ్ళు వర్షించటం చూసి నా కార్ని సైడ్ కి తీసుకొని పక్కనే ఉన్న బేకరీలో పిల్లలని కూర్చోపెట్టి తనతో మాట కలిపాను.
"సుధా నీవు నన్నూ కలిసి దాదాపు పదేళ్ళు దాటిందా? అయి ఉండచ్చు కూడా...తను పోయి అపుడే మూడేళ్ళు కదా.." అంటూ కన్నీలు తూడ్చుకుంది.  

"వాట్? " అంటూ ఆశ్చర్య పోవటం నా వంతయ్యింది. 
"అవును రా...మీ అన్నయ్య షాపు నుండి వస్తూ ఆక్సిడెంట్లో చనిపోయారు.  ఏ రోజు చిన్న కష్టం కూడా నాకు చూపించని చెట్టంత మనిషి చనిపోవటంతో షాపు బాధ్యత ఇంటి బాధ్యత నా మీద పడింది. షాపు లో కూర్చుంటున్న నాకు తెలిసింది అది అప్పుల్లో కూరుకొని ఉంది అని. ఇక లాభం లేదని షాప్ని అమ్మేసాను. ఇల్లు మార్చేసాను. పదేళ్ళ క్రితం నువ్వు ఎంత చెప్పినా ఆయన, అత్తయ్య వద్దన్నారని ఆడ పిల్లలకి ఈ ఉద్యోగం ఏమిటి...చేయ లేదు అని వాల్లంటుంటే నేను ఆ లేడి కండక్టర్ జాబులో జాయిన్ అవకుండా ఇంట్లోనే వున్నాను. ఇప్పుడు చూడు కేవలం 3000 రూపాయల జీతానికి రోజంతా చాకిరి చేస్తున్నాను. నువ్వు చెప్పినట్లు నేను అప్పుడు చేరి ఉండి ఉంటె నా జీవితం వేరేలా ఉండేది సుధా. కాని ఏమి చేస్తాను అప్పుడు నా బలహీనత మీద ఉన్న నమ్మకం చేయగలననే విశ్వాసం మీద లేదు.  అతను లేరనే వేదన వొక వైపు...పిల్లల బాధ్యతలతో ఆర్ధికంగా నిలబడలేక ఈ పోరాటం ఇంకో వైపు...":అంటూ కన్నీళ్ళ పర్యన్తంయ్యింది కమలోదిన. 
ఏమి చెప్పి  ఎలా చెప్పి వోదార్చాలో తెలియలేదు. మౌనంగా పిల్లలని తీసుకొని కమలోదినతో వాళ్ళింటికి వెళ్లి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ వాళ్ళ పిల్లలతో కాసేపు గడిపి "నాకు తెలిసిన వారితో మాట్లాడి మంచి ఉద్యోగం వచ్చేలా చూస్తాను వదిన" అనే మాట చెప్పి ఆమెకు కొంత ఊరట కల్పించి తరిగి ఇంటికి ప్రయాణం అయ్యాను. 
నా ఆలోచనలు తిరిగి ఆ ఏనుగు దానిని గుంజకి కట్టేసిఉన్నకాలి గొలుసు గుర్తుకు వచ్చాయి. అవును నేను ఆలోచించిన సత్యం నాకు కమలోదిన జీవితంలో కనిపించింది. తను ఒకరి మాటలతో తను బలహీనురాలిగా చిన్న ప్రయత్నం తోనే ఆగిపోయింది. తిరిగి ప్రయత్నించి వుంటే తన జీవితం ఈ గజరాజులా సమస్యల సంకెళ్ళలో ఉండేది కాదేమో...

అవును, కొన్నిసార్లు మనిషి తను గతం లో ఉన్న స్థితికి బందీగా ఉండిపోతాడు, మనము అది సాధించలేము  ఇది సాదించలేము. మనవలన అవుతుందా? ఈ పని చాల కష్టం ఎందుకంటే నేను ఒక్కసారి చేశాను బట్ ఐ FAILED, మరల చేసిన వృధానే, ఉన్నదానిలోనే బ్రతుకుదాం ఎందుకు ఈ వృదాప్రయాస అనే మన ఆలోచన విదానం లో నుంచి మనం బయటకి  వచ్చి మనలో మార్పుకోసం క్రోత్త ప్రయత్నం ఒకటి చేద్దాం లేకపోతే మరోసారి ప్రయత్నిద్దాం మన తోటివాడు సాదించగా లేనిది మనం ఎందుకు సదిన్చలెం?.... మనము చేయగలం అనే సంకల్పం తో జీవితం ఒక సవాలుగా తీసుకుంటే  కమల జీవితం లో ఈ రోజు ఇంత కన్నీరు ఉండేది కాదు..... అంతటి బలశాలి అయిన ఆ గజరాజు అల బందీగా ఉండేది కాదు.... ఒక గెలుపు పొందాలి అంటే మారవలసింది మన ఆలోచన విదానం పరిస్థితులు కాదు......
నీవు గెలుపుకోసం చేసే ప్రయత్నం లో ఓడిపోవచ్చు... కానీ నివు చేసే ప్రయత్నం లో ఓడిపోవద్దు..... నీ ప్రయత్నం గెలుపు పోదేవరకు..
 ఇట్లు మీ సుధారాణి చల్ల.