చిన్ను, చెల్లి లంచ్ బాక్స్ వదిలేస్తోంది...జాగ్రతగా మెల్లగా బుజ్జగించి...మధ్యహ్నం తినిపించు....అటు ఇటూ చూసి ఎక్కండి బస్ " అని పిల్లలకు బయ్ చెప్పి వంటగదిలోకి పరిగెత్తుకోచ్చాను....అప్పుడే తొమ్మిదయ్యింది. వడి వడి గా నా లంచ్ బాక్స్ సర్దుకొని, హ్యాండ్ బాగ్ తీసుకొని బయటికి వస్తుంటే అమ్మా " ఏమైనా తిని వెల్లవే..." అనటం వినిపించింది. సమాధానం చెప్పడానికి కూడా అందనంత వేగంగా బయటికి వచ్చాను. బైక్ స్టార్ట్ చేసి రోడ్ మీదకు వచ్చిన ఐదు నిమిషాలకు ఇంజన్ ఆగిపోయింది. పెట్రోల్ లేక అది మొరాయిన్చిందని అర్ధమయ్యింది. చః....నాకు అస్సలు బుద్ధి లేదు. పెట్రోల్ వుందో లేదో కూడా ముందు చూపు లేదు. ఏమిటో ఉదయం ఆఫీసు తొందర...సాయంత్రం ఇల్లు తొందర. ఆలోచిస్తుంటే బాస్ కళ్ళముందు కనిపించింది...బైక్ పక్కకు పెట్టి
"ఆటో..ఆటో" అంటూ కేకేసాను
"బోలో మాడం...కా జానాహై..." గుట్కా నిండిన నోటితో అడిగాడు...
"బేగంపెట్ వెళ్ళాలి" అని తెలుగులో చెప్పాను...
"నూటరివయ్ రూపాయలౌతయ్" అంటూ చెప్పేటప్పుడు వాడు తెలుగోడని అర్ధమయ్యింది...
"మీటరున్దికదా...అది ఎంతైత అన్తిస్తాను...ఒక్క రూపాయి కూడా ఎక్కువివ్వను..." అన్న నన్ను వాడు ఎగా దిగా చూడటం నాకు BP ని తెచ్చింది.
"మీటర్ మీద కుదరదమ్మ...వస్తే రా లేకపోతే లేదు..." పోద్హున్నే బలే గిరాకి దొరికింది అని మనసులో అనుకుంటూ ఆటో స్టార్ట్ చేసి నా సమాధానం కోసం నిలబడ్డాడు.
"అసలు మీకు గవర్నమెంట్ ఎందుకు మీటర్ ఇచ్చింది...ఆకారానికా...ఎందుకు మీటర్ మీద రావు? అయ్యేది డెబ్బై రూపాయలు మీరు అడిగేది దానికి రెండితలు. ఎవరు అడిగే వారు లేరనా మీ ఇష్టం వచ్చినట్లు చెప్పుతున్నారు? " అని నా BP అంత వాడి మీద వెల్లగక్కాను.
"పో..పో మ్మ...వస్తే రా లేక పోతే లేదు...పొద్దున్నే నేనే దొరికానా నీకు..బలే అమెగున్నావ్ తీ..." అని అనుకుంటూ ముందుకి వెళ్ళిపోయాడు
అయ్యో రామ...! మళ్ళి నా స్థితి ఏమిటిప్పుడు? ఆటోలో మీటర్ని కాదని వెళ్ళడానికి మనసోప్పుకోదు...బస్సులో ఇంకా లేట్... అనుకుంటూ అటు ఇటూ చూసే సరికి పెట్రోల్ బంక్ దేవుడిలా కనిపించింది. వేగంగా బండి తోసుకుంటూ బంక్ లోకి వెళ్లాను.
ఏమిటిలా చేసావు అని అడిగితే మీటర్ రీడింగ్ ఇలానే వుంటుంది అన్నాడు....
నాకు చాచి ఒక్కటి చెంప మీద కొట్టాలనిపించింది...
"ఏ మీ మీటర్లు జనాలకోసం పని చేయవు... జలగల్లా జనాల రక్తం రూపాయ్ రూపాయ్ గా తాగంది మీకు ముద్దేక్కదు...." అని మనసులోనే తిట్టుకుంటూ
సిగ్నల్ దగ్గరకు వచ్చాను...రెడ్ సిగ్నల్ తో ఆగిపోయాను...టైం చూస్తే పది అవుతోంది. కళ్ళముందు డిల్లి నుండి వస్తున్నా బాస్ కనిపించింది. ఇక టెన్షన్ మొదలయ్యింది. త్వరగా చేరుకోవాలి ఆఫీసుకి. చః...ఎంత తొందరగా లేచినా ఇంట్లో పిల్లలతో పని తెమలదు...ఈ రోజు ఆమెతో నాకు చివాట్లు తప్పవు.. అని నన్ను నేను తిట్టుకుంటూ వుంటే చంకలో చంటి బిడ్డను వేసుకొని రూపాయి కోసం చేయి చాచింది ఒక గుడ్డి మహిళ.... మళ్ళీ నాకు పెట్రోల్ బంక్ రూపాయి గుర్తుకు వచ్చింది... హాథ విధీ...అనుకుంటూ పర్సులో చిల్లర తీసి ఇచ్చి 'ఏమిటో ఈ గాదె కింద ఉండి తింటున్న పందికొక్కులు బయటపడవు. తిన్దామనేసరికి పేదోడికి గింజ దొరకదు...వీళ్ళు మారారు...సమాజం మారదు." అనుకుంటూ వుంటే గ్రీన్ సిగ్నల్ పడింది.
హమ్మయ్య అనుకున్నాను... అయినా పోలీసు బాబాయి ట్రాఫిక్ని వదలటం లేదు...అసలే బాస్ టెన్షన్..అందులోను లేట్..టైం చూసాను...పది ఐదు.
బైకు ఆపి కాళ్ళు ఎత్తి చూసాను....అప్పుడు అర్ధమయ్యింది. శ్రీ....శ్రీ...శ్రీ...దేశోద్దరణ కై...క్షమించాలి...రాష్ట్రోద్దరనకై కంకణం కట్టుకొని బయలుదేరి వచ్చిన ముఖ్య మంత్రి గారి కాన్వాయి గురించి మా లాంటి అల్పుల వాహనాలకి బ్రేక్ పడ్డదని అర్ధమయ్యింది....
నన్ను అడగకండి ఆ తరువాత నా ఆక్రోశం ఏమిటో....
నేను పెట్రోల్ బంక్లో అరవై పైసలు ఎక్కువ పెట్టినందుకు కాదు...ఆటో వాడికి వంద రూపాయలు ఎక్కువ పెట్ట లేకా కాదు.... అప్పనంగా, అన్యాయంగా జనాలని మోసం చేయటం ఒకటైతే...మనలో చాలా మంది నోరుమూసుకొని పోనీలే అరవై పైసలే కదా...వందే కదా అని అవసరాలను నెట్టుకుంటూ పోతూ రుచిమరిగిన వీళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తూ....ఖర్చు చేసే స్తోమత లేని వాడి చేత కూడా ఖర్చు పెట్టించే స్థితికి తీసుకువచ్చాము.... ఎన్ని అరవైపైసలు...కలిసి రోజులో వాడికి వేలుగా మిగులుతున్నాయి? ఎంతమంది ఆటోల మీటర్లు చప్పుడు చేయటం లేదో...మీకు అనుభవం అయ్యే వుంటుంది...ఆలోచించండి....వ్యతిరేకించండి :)
Sudha Rani Challa