మనసు కి శాంతి ఎలా?






గతం ఎప్పుడు ఒక అనుభవం మాత్రమే... ఆ అనుభవం తోటి వర్తమానంలో వేసే అడుగులు తడపడకుండా భవిష్యత్తులో పదిలమైన స్థానికి అవి పునాదులుగా వుండాలి... ఒక పని లో ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత..తిరిగి "నా నిర్ణయం తప్పా?" "ఇలా చేసి వుండాల్సింది" "అలా ఎందుకు చేసాను?" అనే తిరంగపు ఆలోచనలే మనసుకు ముఖ్య అశాంతులు..... అవి నీ ధరి చేర నీయకు. గతాన్ని ఒక అనుభవంగా మాత్రమే చూడు. వర్తమాన్నాన్ని "ఈ నిమిషం నా చేతి నుండి చే జారిపోతే అందమైన...సంతోశకరమైన క్షణాల స్మృతులు" కోల్పోతానేమో అనే విధంగా జీవితాన్ని ఆనందించు... నీ చుట్టూ ఉన్న నిన్ను నిన్నుగా నిస్వార్ధంగా ప్రేమించే వారిని ఆనందింప చెయ్. ప్రతి నిమిషాన్ని పదిలమైన స్మృతులుగా మార్చుకో... భవిష్యత్తులోని నీ ఆశ ఒక నాటికి నీ వర్తమానంలో ఆచరణగా మరి వెను తిరిగి చూసిన సమయాన ఆ గతము ఒక విజయానికి నాందిగా...ఒక అనుభూతికి మరువలేని స్మృతిగా మార్చుకో.. పడి లేవటం అందరూ చేసే పని...పడి తిరిగి పడకుండా జాగ్రత్త పడుతూ లేచి ముందుకు నడుస్తూ ఎత్తైన శిఖరాన్ని చేరుకొని అక్కడే నిలబడటం కొందరు మాత్రమే చేసే పని... ఆ కొందరిలో నీవు ఒకడిగా ఎందుకు ఉండకూడదూ...
ఆవేశమే నీ ఆలోచనని మారుస్తుంది...ఆ ఆలోచనే నిన్ను నీ నుండి దూరం చేస్తుంది..ఆ దూరమే నీకు అశాంతిని మిగులుస్తుంది... ఆ అశాంతే నిన్ను చివరకి వొంటరిని చేస్తుంది... సో "ఆవేశం" కాల గమనానికి ఒక శాపం... నీకు శాపం కావాలా.. పదిలమైన సంతోషం కావాలా? విజ్ఞతతో ఆలోచించి సరైన అడుగు వేసే ఎవరికైనా భావిష్యత్హు ఒక ఆనంద హేల... వర్తమానం...సంతోషాల డోల....గతం తీపి జ్ఞాపకాల జోల..